మాదాపూర్‌ భారీ అగ్ని ప్రమాదం..ఆస్తి దగ్దం

నవతెలంగాణ-హైదరాబాద్ : మాదాపూర్‌లోని మూవింగ్ ఎడిన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగడంతో ఆస్తి దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైటెక్ సిటీ సమీపంలోని ఓ భవనంలోని పెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Spread the love