మెగ్నీషియం లోపిస్తే…

Magnesium deficiency...మెగ్నీషియం మనకు అత్యంత అవసరమైన ఖనిజం. ఇది మనకు ఎనర్జీనిస్తుంది. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్‌ షుగర్‌ను కంట్రోల్‌ చేస్తుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేసేలా సాయపడుతుంది. ఆకుకూరలు, కూరగాయల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మనం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం మన బాడీలో ఉండాలి. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైముల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్‌ (పిండి పదార్థాలు), కొవ్వు, ప్రోటీన్స్‌ (మాంస పదార్థాలు) నుంచి మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియంది కీలక పాత్ర. మన ఎముకలు గట్టిగా ఉండాలన్నా, మన నరాలు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండాలన్నా మెగ్నీషియం అవసరం. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే మెగ్నీషియం కావాలి. పురుషులకు రోజుకు 400 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవసరం. మహిళలకు 300 మిల్లీ గ్రాములు అవసరం.
మెగ్నీషియం లేకపోతే ఏమవుతుంది : జనరల్‌గా మనం తినే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియంను ఇస్తాయి. అలాగని పదే పదే కిడ్నీలపై ఆధారపడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మన శరీరంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కొన్ని లక్షణాల ద్వారా దానిని మనం గుర్తించవచ్చు.
లక్షణాలు :
– ఆకలి వేయదు. వికారంగా ఉంటుంది. వామ్టింగ్‌ వస్తున్నట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్లు మసకబారతాయి. కండరాల్లో నొప్పి వస్తుంటుంది. అలసట ఉంటుంది. టెన్షన్‌ పెరుగుతుంది.
– నిద్ర సరిగా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా సమస్య కూడా పెరుగుతుంది.
– మెగ్నీషియం వెంటనే కావాలంటే ఓ కాఫీ తాగేయాలి. లేదా డార్క్‌ చాక్‌లెట్స్‌ తినాలి. అదే పనిగా డార్క్‌ చాక్‌లెట్స్‌ తినడం మంచిది కాదు. మెగ్నీషియం కోసం కాయగూరలు, ఆకుకూరలు తినాలి.
మెగ్నీషియం ఉండే ఆహారాలు :
– ఖర్జూరాలు, బఠాణీలు, కోకో, జీడిపప్పు, బాదం, గింజలు, తృణధాన్యాలు, పప్పులు, ఆకు కూరలు
– పండ్లు (ఫిగ్స్‌, ఆవకాడో, అరటిపండ్లు, రాస్‌ బెర్రీస్‌)
– బ్రకోలీ, క్యాబేజీ, గ్రీన్‌ బఠాణీలు, మొలకల వంటివి.
– సీఫుడ్‌ (సాల్మన్‌, మాకెరెల్‌, ట్యూనా ఫిష్‌)
– బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌
మెగ్నీషియం లోపించినట్టు మీకు అనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే అది రకరకాల వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండా లంటే వీలైనంతవరకూ వేపుడు పదార్థాలు తగ్గించాలి. పండ్లు, పప్పులు, ఆకుకూరలు తినండి.

Spread the love