మహాలక్ష్మి పథకం మహిళలకు వరం 

– మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచన 
– దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత 
నవతెలంగాణ – దుబ్బాక/ దుబ్బాక రూరల్ 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మీ పథకం మహిళలకు వరమని ఉచితంగా రాష్ట్రం మొత్తం  ప్రయాణించవచ్చని దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత అన్నారు. ఆదివారం దుబ్బాక బస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని సిద్దిపేట ఆర్డీవో రమేష్ బాబుతో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో ఎక్కిన మహిళలకు జీరో చార్జ్ టికెట్లను మహిళ ప్రయాణికులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ప్రయాణానికి మహిళలకు తప్పనిసరి ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి, దుబ్బాక డిపో ఇన్చార్జ్ లింగం గౌడ్, బారాస నాయకులు రొట్టె రాజమౌళి గన్నె భూమిరెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, పల్లె రామస్వామి, పలువురు కౌన్సిలర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love