
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాకు చేరుకున్న అదనపు బి.యు లను ఈవీఎం గోదాం లో ఎఫ్.ఎల్.సి చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాం లో చేపట్టిన ఎఫ్.ఎల్.సి నిర్వహణను యస్.పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లత లతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గాలలో పోటీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఎన్నికల సంఘం అదేశాలమేరకు జిల్లాకు 1200 అదనవు బి.యు లను తెప్పించి 12 మంది ఈ. సి. ఐ. ఎల్ ఇంజనీర్ల తో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి రోజు ఎఫ్.ఎల్.సి చేపట్టడం జరిగిందని తదుపరి ర్యాండమైజేషన్ అలాగే సెగ్రిగేషన్ తదుపరి నియోజక వర్గాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట వేణు వేణుమాధవ్, కోదాడ సూర్యనారాయణ, హుజూర్ నగర్ శ్రీనివాస్, బి.ఆర్.ఎస్. పార్టీ నుండి సవరాల సత్యనారాయణ, బి.జే.పి. నుండి అబిడ్, బి.యస్.పి. నుండి స్టాలిన్ లు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, ఏ.ఓ సూదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.