3న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పీడీఎస్ యూ

నవతెలంగాణ –  డిచ్ పల్లి
నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయాలని ఫిబ్రవరి 3 న ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే ధర్నా ను  విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రదాన  జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ కమిటీ ఆధ్వర్యంలో  యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు చలో ఢిల్లీ బ్రోచర్స్ ను విడుదల చేశారు.అనంతరం జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ NEP (2020) రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని , న్యూ ఎడ్యుకేషన్ పాలసీ( 2020) లో నేడు ఉన్న అకాడమీక్ స్ట్రక్చర్ మార్చి 5+3+3+4 ని  తీసుకొచ్చినరని,దీని ద్వారా విద్యార్థులకి ఐడియాలాజికల్ ప్రేమ్ వర్క్ దెబ్బతింటుందని , పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ విధానానికి అలవాటు పడలేక చదువులు మధ్యలో ఆపవేసే ప్రమాదం ఉందని,నాలుగు సంవత్సరాల డిగ్రీ లో డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉందని, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశ విద్య రంగాన్ని కబలిస్తున్నాయని, దుర్మార్గమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడాలని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3 2024న విద్యార్థులు మేధావులు టీచర్లు ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ కార్యదర్శి జయంతి కమిటీ సభ్యులు రవీందర్, అక్షయ్, ఆకాష్, మోహిత్, వంశీ రామకృష్ణ , ప్రవీణ,వివేకా వర్దిని,నవ్య,రేణుక,అనూష,రాకేశ్, రాము,తదితరులు పాల్గొన్నారు.
Spread the love