నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

నవతెలంగాణ -కూసుమంచి
ఈనెల 9న సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం సభ్యులు, సానుభూతిపరులు, వాపక్ష భావజాల అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు, భారీగా తరలివచ్చి నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పలు గ్రామాలలో ఆయా గ్రామశాఖల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల ఇంచార్జీ బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, మల్లెల సన్మానతరావు, మూడు గన్యా నాయక్‌, నాయకన్‌ గూడెం కన్వీనర్‌ కర్ణ బాబు, సిపిఎం సీనియర్‌ నాయకులు కంచర్ల జగన్మోహన్‌ రెడ్డి, రేలా ఇంద్రారెడ్డి, కృష్ణయ్య, వేణు, అంజయ్య, కృష్ణంరాజు పాల్గొన్నారు.

Spread the love