– పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించడం
– గొప్ప విషయం : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ – ముషీరాబాద్
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ వ్యాపారంలోనే కాదు ప్రజాసేవ చేయడంలోనూ ముందుందని, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించడం గొప్ప విషయం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన రూ.200 కోట్ల సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు రూ.4.55 కోట్ల స్కాలర్‌షిప్‌ను బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మలబార్ గ్రూప్ చైర్మెన్ ఎం.పి.అహ్మద్‌తో కలిసి మంత్రి హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్ డైమండ్ గ్రూప్స్ ద్వారా వ్యాపార రంగంలోని నాణ్యతను చూపిస్తూనే పేద విద్యార్థులను ఆదుకొనడంలో ముందుండడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య ఎంతో అవసరమని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ చారిటీ ద్వారా పేదలకు విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. విద్యార్థుల ఉన్నతమైన చదువులను ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మలబార్ గ్రూప్ చైర్మెన్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సామాజిక స్థాయిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో విద్య ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. తమ స్కాలర్‌షిప్ కార్యక్రమాల ద్వారా, విజయం సాధించగల సామర్థ్యం ఉండి, చదువులను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు మద్దతివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమాల కోసం గ్రూప్ తన నికర ట్రేడింగ్ లాభంలో ఐదు శాతాన్ని కేటాయిస్తున్నదని తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రాంతీయ మార్కెట్లలో విద్యపై దృష్టి సారించిన తమ సీఎస్‌ఆర్ ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉందన్నారు. తద్వారా విద్యార్థులకు నిర్మాణాత్మక స్థిరమైన మద్దతునందిస్తోంని చెప్పారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సేవలోనూ మలబార్ సంస్థ ముందడుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



