Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే

రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే

- Advertisement -

రాజ్యసభ చైర్మెన్ రాధాకృష్ణన్‌‌ గుర్తింపు
న్యూఢిల్లీ :
రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా మళ్లీ గుర్తింపు పొందారు. ఆయన పదవీకాలం ఈనెల 25తో ముగియనుండగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ చైర్మెన్‌ రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేతగా ఖర్గేను గుర్తించారు. 26నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోడీ బులెటిన్ విడుదల చేశారు. అంతకుముందు రాజ్యసభ చైర్మె న్ చాం బర్లో సోమవారం ‌రాజ్యసభ ప్రతిపక్ష‍ నేతగా మల్లికార్జున ఖర్గే ప్రమాణం చేశారు. ఆయన చేత రాజ్యసభ ఛైర్మెన్‌, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖర్గే తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసే గౌరవం నాకు లభించింది. రాజ్యసభకు ప్రతిపక్ష నాయకుడిగా సేవలు కొనసాగించడం అపారమైన గర్వకారణం, బాధ్యత. నాకు నిరంతరం మద్దతు అందించిన భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌కు, డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. ఇంకా కాంగ్రెస్ పార్టీలోని తోటి సహచరులు, ఎంపీలకు, నా సుదీర్ఘ ప్రజా జీవితం, పార్లమెంటరీ సేవ ప్రయాణంలో అచంచలమైన విశ్వాసం, ప్రోత్సాహంతో నాకు అండగా నిలిచిన లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు నా కృతజ్ఞతలు. అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు, ముఖ్యంగా ఇండియా బ్లాక్‌లోని సహచరులకు, ఇతర ప్రతిపక్షాల సహకారానికి నేను కృతజ్ఞుడను.” అని ఖర్గే అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా ఎనిమిది మంది నూతన రాజ్యసభ ఎంపీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఛాంబర్‌లో ఖర్గే ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన ఏడుగురు సభ్యులు రాజ్యసభ ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. నూతనంగా ప్రమాణం చేసిన వారిలో జితేంద్ర మేఘ్‌జీభాయ్ కంజారియా, మాన్‌సింగ్ మేరామన్ పర్మార్ (గుజరాత్), ఎం. నాగరాజ (కర్ణాటక), రాజేంద్ర హీరాలాల్ జైన్ (మహారాష్ట్ర), అధికారిమయుమ్ శారదా దేవి (మణిపుర్), అల్కా సింగ్ (రాజస్థాన్) ఉన్నారు. చైర్మెన్ ఛాంబర్, సభలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్, సభ నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -