Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మన ఊరు-మన కోచింగ్ సెంటర్' ప్రారంభం!

మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మన ఊరు-మన కోచింగ్ సెంటర్’ ప్రారంభం!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో సోమవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉచిత కానిస్టేబుల్ ఎస్సె కోచింగ్ నిర్వహిస్తున్న ‘మన ఊరు మన కోచింగ్ సెంటర్’ను మంథని శివ కిరణ్ గార్డెన్ లో మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.అదే విధంగా మంథనిలోని టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ పిల్లల ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవంతో పాటు ఉచిత హెల్మెట్ పంపిణీ చేయనున్నారు.

మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో పాటు కోకో కోలా ఫ్యాక్టరీ, పలు కంపెనీలతో పాటు అధికారులతో రివ్యూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పట్టణంలోని బొక్కల వాగు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించిన ప్రజెంటేషన్లో కంపెనీ ప్రతినిధులతో పాల్గొనున్నారు. మంథని సివిల్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించి నూతన డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం కార్యక్రమంతో పాటు రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న కోకోకోలా ఫ్యాక్టరీ సంబంధించిన స్థలం జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో ఫ్యాక్టరీ సంబంధించిన ప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -