Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో పలు బాధితుల కుటుంబలను  శనివారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. దమ్మన్నాపేట గ్రామంలో రాజుల రమేష్ వాళ్ల అన్న ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కొనసముందర్ గ్రామంలో లాడే అశోక్ వాళ్ల కొడుకు లాడే చరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. లాడే అశోక్ ను పరామర్శించిన   మానాల మోహన్ రెడ్డి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో చరణ్ మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చరణ్ మూతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మాజీ మండల అధ్యక్షులు సుంకేటా రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -