పలువురు ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు, ఉద్యోగోన్నతులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పలువురు ఐఎఫ్‌ఎస్‌లకు ఉద్యోగోన్నతులు, బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోలను జారీ చేశారు. ఇప్పటిదాకా పీసీసీఎఫ్‌(ఎఫ్‌సీఏ)గా పనిచేస్తున్న మోహన్‌చంద్ర పర్గెయిన్‌ పీసీసీఎఫ్‌(వైల్డ్‌ లైఫ్‌, చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌) పోస్టుకు బదిలీ అయ్యారు. పీసీసీఎఫ్‌(హరితరహారం) బాధ్యతలు చూస్తున్న డాక్టర్‌ సి.సువర్ణ పీసీసీఎఫ్‌(కంపా)గా నియమితులయ్యారు. అడిషనల్‌ పీసీసీఎఫ్‌(హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)గా పనిచేస్తున్న సునీతా మహేశ్‌ భగవత్‌ పీసీసీఎఫ్‌(అడ్మినిస్ట్రేషన్‌)కు బదిలీ అయ్యారు. ప్రమోషన్లు పొందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్లో ఎస్‌.శాంతారామ్‌, ఎస్‌.రాంబాబు, డాక్టర్‌ సునిల్‌ ఎస్‌.హిరిమత్‌ ఉన్నారు. 2010 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఎస్‌.శాంతారామ్‌కు కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(సీఎఫ్‌) ఉద్యోగోన్నతి కల్పించి సూపర్‌ టైమ్‌ స్కేల్‌(ఐ) వర్తింపజేశారు. అతన్ని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డు డైరెక్టర్‌గా నియమించారు. 2011 బ్యాచ్‌కు చెందిన సునిల్‌ ఎస్‌.హిరిమత్‌ నెహ్రు జువాలజికల్‌ పార్కు క్యూరేటర్‌గా నియమితులయ్యారు. అదే బ్యాచ్‌కు చెందిన రాంబాబు హైదరాబాద్‌ సర్కిల్‌ డీసీఎఫ్‌, సీఎఫ్‌గా ప్రమోషన్‌ పొందారు.

Spread the love