- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించిన 24 గంటల్లోనే క్యూబాలో రిక్టర్‌స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. గత 150 ఏళ్లలో ఆ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైనదిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూకంప కేంద్రం క్యూబా పశ్చిమ ప్రాంతంలోని మంటువా పట్టణానికి వాయవ్య దిశలో సుమారు 104 కి.మీ. దూరంలో, భూమికి 26 కి.మీ. లోతులో నమోదైంది. ఈ భూకంపం క్యూబాతో పాటు కరీబియన్ ప్రాంతం, మెక్సికో గల్ఫ్, అమెరికాలోని ఫ్లోరిడా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలకు దారితీసింది.
- Advertisement -



