Tuesday, April 28, 2026
E-PAPER
Homeజాతీయంవామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు

వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో
ప్రజల నుంచి విశేష స్పందన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్‌ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. డోమ్‌జూర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్‌ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీదీప్‌ భట్టాచార్య, కేంద్ర కమిటీ సభ్యురాలు కనినికా ఘోష్‌, అభ్యర్థి దులు దాస్‌, ప్రముఖ నాటక రచయిత బిమల్‌ చక్రవర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదీప్‌ భట్టాచార్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల మొదటి విడతలో 15 ఏండ్ల తర్వాత ప్రజలు తమ ప్రజాస్వామ్య ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇది బెంగాల్‌కు కొత్త ఊపిరినిచ్చిందని అన్నారు. ఇది బెంగాల్‌లో తీవ్ర నిరంకుశత్వం, అవినీతికి, దేశవ్యాప్తంగా 12 ఏండ్ల కార్పొరేట్‌ మతతత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తీర్పునిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మత సామరస్యం పునరుద్ధరణ కోసం ఓటు వేయాలని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఎక్కడ దాడి జరిగినా, మహిళా ఉద్యమ నాయకురాలు దులు దాస్‌ అసెంబ్లీలో మహిళా పోరాట అంశాన్ని లేవనెత్తుతా రని తెలిపారు.కనినికా ఘోష్‌ మాట్లాడుతూ మహిళలపై దాడులు జరుగుతున్న ప్రతిచోటుకి దులు దాస్‌ చేరుకుని బాధితుల గొంతుకయ్యారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై దాడులను నిర్మూలిస్తామన్న బీజేపీ వాదనకు బీజేపీనే ఏకీభవించదని, హత్రాస్‌, ఉన్నావ్‌ లైంగికదాడి నిందితులతో ఊరేగింపు నిర్వహిస్తున్న బీజేపీ దాడులను ఎలా నిర్మూలిస్తుందని ప్రశ్నించారు. పద్దెనిమిది సార్లు లైంగికదాడికి గురైన బిల్కిస్‌ బాను నిందితులను పెరోల్‌పై విడుదల చేసి, పూలమాలలు వేసి ఊరేగింపుగా తీసుకువచ్చే బీజేపీ , మహిళలకు న్యాయం చేస్తుందని నమ్మలేమని పేర్కొన్నారు. మహిళల అత్యున్నత గౌరవం, ఆత్మగౌరవం, హక్కులను లాక్కోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. భారీ ర్యాలీలో వ¶సివేసిన నిస్కో ఫ్యాక్టరీ భూమితో పాటు సింగర్‌ భూమిలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే నినాదాన్ని హోరెత్తించారు. అదే విధంగా హౌరా సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి డాక్టర్‌ అభిజిత్‌ బందోపాధ్యాయకు మద్దతుగా గర్ఫా నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అసెంబ్లీ ప్రాంతం మొత్తం చుట్టుముట్టి హన్స్‌ఖాలి పోల్‌ గుండా వెళ్లి చంద్‌మారి జాల వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య, అభ్యర్థి డాక్టర్‌ అభిజిత్‌ బందోపాధ్యాయ, పలువురు నాయకులు పాల్గొన్నారు. హౌరా సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి, న్యాయవాది ఇంతియాజ్‌ అహ్మద్‌కు మద్దతుగా విజయానంద్‌ పార్క్‌ నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ, పలు మార్గాల గుండా ప్రయాణించి మందిర్‌తలా వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో శ్రీదీప్‌ భట్టాచార్య, జిల్లా కార్యదర్శి దిలీప్‌ ఘోష్‌, అభ్యర్థి ఇంతియాజ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

డుమ్‌డుమ్‌ అసెంబ్లీ నియోజకవర్గ
సీపీఐ(ఎం) అభ్యర్థి మj¶ఖ్‌ బిస్వాస్‌కు ప్రజల మద్దతు

డుమ్‌డుమ్‌ శాసనసభ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి మ‌యూఖ్‌ బిస్వాస్‌కు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోంది.మ‌యూఖ్‌ బిస్వాస్‌కు మద్దతుగా సోమవారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం, సీనియర్‌ రాబిన్‌ దేవ్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నాయకురాలు ఐషే ఘోష్‌, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు విక్రమ్‌ సింగ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మj¶ఖ్‌ బిశ్వాస్‌ గీతం.. ”గాలి హోరున వీస్తోంది…డుమ్‌డుమ్‌పై విశ్వాసం ఉంది మ‌యూఖ్‌ బిశ్వాస్‌)” పాటలోని మొదటి చరణాన్ని నిజం చేసింది. ఎర్ర జెండాలు పట్టుకున్న సీపీఐ(ఎం) కార్యకర్తలు, మద్దతుదారుల బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. రోడ్‌ షో ప్రారంభానికి ముందు రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం డుమ్‌డుమ్‌లోని సెంట్రల్‌ జైల్‌ మైదాన్‌లో ఉన్న బీ.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు అధికారంలో ఉన్న రెండు పార్టీలు చేస్తున్న నీచమైన రాజకీయ ప్రయత్నాన్ని ఎండగట్టారు. ”బెంగాల్‌ను కాపాడాలంటే, నబన్నా నుంచి దొంగలను తరిమికొట్టాలంటే, 56 అంగుళాలు, 356 సెక్షన్లు అనేవి ముఖ్యం కాదు. బెంగాల్‌లోని హిందువులు, ముస్లింలు, అణగారిన వర్గాలు, సామాన్య ప్రజలు, కుల, మత భేదం లేకుండా అందరూ ఒక్కటిగా కలవాలి. బ్రిటిష్‌ వారిని తరిమికొట్టిన వారు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వారే ఈ అవినీతికి, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కూడా పోరాడి వామపక్ష అభ్యర్థికి మద్దతు ఇస్తారు. ఈ రెండు రోజులు దురాశ, హింస, మోసంతో నిండిపోకుండా, డుమ్‌డుమ్‌ నియోజకవర్గం నుంచి మ‌యూఖ్‌ బిస్వాస్‌ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు. ఐషీ ఘోష్‌ మాట్లాడుతూ ”రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల మాదిరిగానే, ఇక్కడి ప్రజలు కూడా తృణమూల్‌ అవినీతిని చూశారు. తృణమూల్‌తో ద్వంద్వ వైఖరిని సృష్టించే రాజకీయాలు కూడా ఈ రోజు ఎవరికీ తెలియనివే. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల దుస్థితి అంతులేనిది. వాస్తవానికి, సామాన్య ప్రజలు తమ పిల్లల విద్య, ఉద్యోగం, జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి ఒక సురక్షితమైన వ్యవస్థను కోరుకుంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారి డిమాండ్లను వామపక్షాలు మాత్రమే నెరవేర్చగలవని మేము చెప్పాం.” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -