Tuesday, April 28, 2026
E-PAPER
Homeఆటలుటెన్‌పిన్‌ చాంప్స్‌ గాంధీ, శతి

టెన్‌పిన్‌ చాంప్స్‌ గాంధీ, శతి

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర టెన్‌పిన్‌ బౌలింగ్‌ టోర్నీలో కొటారీ గాంధీ, శతి అదిని టైటిల్‌ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో గాంధీ 390-335 తేడాతో ప్రేమ్‌సాయిపై అద్భుత విజయం సాధించాడు. తొలి గేమ్‌ నుంచే దూకుడు కనబరిచిన గాంధీ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. మొదటి గేమ్‌లో 212-156తో ఆధిక్యం కనబరిచిన ఈ యువ ప్లేయర్‌ ఓవరాల్‌గా 55 పాయింట్ల లీడ్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో ప్రేమ్‌సాయి, రక్షిత్‌ రాఘవ్‌, నవీన్‌ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. మరోవైపు మహిళల ఫైనల్లో శతి 273-246 తేడాతో సింధూరపై గెలిచింది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన రత్నరాజు(196), ప్రేమ్‌సాయి(196) ప్రత్యేక బహుమతులు సొంతం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -