Sunday, April 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా ఐఏఎస్‌ల బదిలీలు

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

- Advertisement -

ఒకేసారి 30 మందికి ట్రాన్స్‌ఫర్‌
ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా జీ ముకుందరెడ్డి
నారాయణ్‌పేట్‌ కలెక్టర్‌గా సీహెచ్‌ ప్రియాంక
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ప్రియాంక అల
పలు జిల్లాల కలెక్టర్ల మార్పు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లు సహా పలు విభాగాల్లోని 30 మంది ఐఏఎస్‌లను ఒకేసారి ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సంజరుకుమార్‌ (1995)ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఖాళీ అయిన ఆయన స్థానాన్ని ఎమ్‌ దానకిషోర్‌ (1996)తో భర్తీ చేశారు. ఆయన ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ టు గవర్నర్‌ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. తెలంగాణ సోషల్‌వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శిగా బీ విజియేంద్రను నియమించారు. ఈ పోస్టులో అదనపు బాద్యతలు నిర్వహిస్తున్న సబ్యసాచిఘోష్‌ను రిలీవ్‌ చేశారు.హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి (2010)ని లేబర్‌, ఎంప్లారుమెంట్‌, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శిగా నియమించారు. ఆమె రెవెన్యూ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ పోస్టుల్లో ఇప్పటివరకు కొనసాగిన దానకిషోర్‌ (1996)ను రిలీవ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్న కృష్ణ ఆదిత్య (2014)ను పరిశ్రమల శాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు. పౌరసరఫరాల శాఖ సీఈఓగా పనిచేస్తున్న జండగీ హన్మంతు కొండిబాను ఆరోగ్య శ్రీ సీఈఓగా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న పీ ఉదరుకుమార్‌ (2016)ను జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పీ ప్రియాంక (2016)ను రోడ్లు భవనాల శాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బీఎమ్‌ సంతోష్‌ (2017)ను నియమించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి (2018)ని ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. ఆయనకే గనుల శాఖ వీసీఎమ్‌డీగాకూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటర్‌బోర్డు డైరెక్టర్‌గా అభిలాష అభినవ్‌ (2018) నియమితులయ్యారు. నాగర్‌కర్నూల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ (2019)ను పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ గోల్కోండ జోనల్‌ కమిషనర్‌ జీ ముకుందరెడ్డి (2019)ని సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ్‌ చౌహాన్‌ (2020)ను సీఎమ్‌ఆర్‌ఓ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా నియమితు లయ్యారు. ఐటీశాఖ స్పెషల్‌ సెక్రటరీగా పనిచేస్తున్న భవేష్‌ మిశ్రా (2015)ను నిర్మల్‌జిల్లా కలెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రియాంక అల (2016)ను హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

నారాయణ్‌పేట్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ (2017)ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌ (2017)ను ఖమ్మం కలెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావు (2018)ను ములుగు జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ ప్రియాంక (2018)ను నారాయణ్‌పేట్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ (2019) నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మంద మకరందు (2020) ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. మహబూ బాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) లెనిన్‌వత్సల్‌ టొప్పొ (2021) ఐటీడీఏ ఏటూరు నాగారం కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ములుగు జిల్లా బాధ్యతల్ని అదనంగా చూస్తారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కొప్పిశెట్టి కిరణ్మయి (2022) రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌)గా నియమితులయ్యారు. ఉట్నూరు ఆదిలాబాద్‌ జిల్లా సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ (2022) కుమురంభీం ఆసిఫాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈఓగా పీ ఉదరుకుమార్‌ (2016) నియమి తులయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బధావత్‌ సంతోష్‌ (2016) శేరిలింగంపల్లి జోనల్‌ కమిష నర్‌గా నియమితులయ్యారు. మిర్యాలగూడ- నల్గొండ జిల్లా సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌ మలెంపాటి (2022) ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. బోధన్‌, నిజామాబాద్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో (2022)ను ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు.జయశంకర్‌ భూపాలపల్లి సబ్‌ కలెక్టర్‌ మయాక్‌ సింగ్‌ను కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా నియమితుల య్యారు. చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ (నాన్‌ కేడర్‌)గా పనిచేస్తున్న ఎస్‌ శ్రీనివాసరెడ్డిని రాజేంద్రనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -