Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్లకు తక్షణమే అమ్మ తల్లి టీకాలు పంపిణీ చేయాలి…

గొర్లకు తక్షణమే అమ్మ తల్లి టీకాలు పంపిణీ చేయాలి…

- Advertisement -

– జిఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ :
 గొర్రెల మేకలకు తక్షణమే అమ్మ తల్లి టీకాలు పంపిణీ చేయాలని జిఎంపిఎస్ (గొర్రెల మేకల పెంపకం దారుల సంగం) జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిఎంపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మన్నేవారి పంపు, వడపర్తి గ్రామాలలో  గొర్రెల మందలను సందర్శించి, గొర్ల కాపరులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్నందున సీజన్లో వచ్చే వ్యాధులపై గొర్రెల మేకల పెంపకం దారులకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వం వారికి సరిపడా మందులు తక్షణమే సరఫరా చేయాలని కోరారు.

ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు రకాల మందులు అమ్మ తల్లి, పురు రోగం, చితుకు రోగం, సోలు రోగాలకు సంబంధించిన టీకాలు హాస్పిటల్లలో అందుబాటులో ఉంచాలని కోరారు. సీజన్ వారిగా వస్తున్న రోగాలకు సంబంధించి మందులు లేవని వెటర్నరీ డాక్టర్లు తప్పించుకుంటున్నారని, గొర్రెల కాపరులు ఏం చేయాలో తెలియక ప్రైవేయిట్ లో కొనుగోలు చేసి వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు. గొర్రెలకు సంబంధించిన టీకాలు ప్రభుత్వ డాక్టర్లు వేసినప్పుడు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, డబ్బులు అడుగుతున్నారని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాధికారులను కోరారు. 

ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల అధ్యక్షులు దేవునూరి బాల్లయ్య, గొర్ల కాపరుల సంఘం నాయకులు   ఉడుత జంగయ్య, మేడబోయిన సురేష్, గొర్రెల కాపరులు మేడబోయిన చంద్రయ్య, ఐలయ్య, మేడబోయిన మల్లేష్, ఉడుత సత్తయ్య, మేడబోయిన బాల మల్లయ్య, తాటికొండ బుచ్చి రాములు, మేడబోయిన నరసింహ, శ్రీరాములు, ఆంజనేయులు, శ్రీశైలం,  సత్తయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -