
– తే.యూ లో 138 వ మేడే పోస్టర్స్ ఆవిష్కరణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐఎఫ్టియు అనుబంధం) ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల ముందు 138 వ మేడే పోస్టర్స్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి బికొజి మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడి ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్మిక హక్కులను సాదించుకోవటం జరిగిందని, హక్కుల పోరాటంలో చికాగో కార్మికులు తమ ప్రాణాలను ఆర్పించారని ,నేడు పాలకులు హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలనూ తీసుకువస్తున్నారని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వటం లేదని , శ్రమ దోపిడి జరుగుతుందని, ఉద్యోగ భద్రత లేదని కావున చికాగో కార్మికుల పోరాట స్పూర్తి తో హక్కుల కోసం పోరాడాలని , మేడే 1 న సెలవు దినం ప్రకటించాలని, 138 వ మేడే నూ పెద్దఎత్తున జరిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మధులిక ,సభ్యులు సుధీర్, డాక్టర్ రవీందర్ నాయక్, రమేష్ గులాబ్, గంగాధర్, జమున రాణి, భవాని శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.