
సీసీ రోడ్డుపనులు నాణ్యతతో చేపట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఎల్ సీ మంకెన కోటిరెడ్డి అన్నారు.మంగళవారం మండలం లోని కోమటి కుంట తండాలో 10 లక్షల రూపాయల వ్యయం తో చేపడుతున్న సీసీ,మట్టి రోడ్డును ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సీసీ రోడ్డునిధులు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. రూ. 10 లక్షలతో తో మంజూరైన కోమటి కుంట తండాలో130మీటర్లు రోడ్డుకు 5 లక్షలతో సీసీ రోడ్డు పనులు, భాసోని భవితండాలో వ్యవసాయ పొలాలకు కిలోమీటర్ మట్టి రోడ్డుకు 5 లక్షలతో మట్టి రోడ్డుకు ఎంఎల్ సి నిధులతో పూర్తిచేయాలని తెలిపారు.రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం బీటీ రోడ్లు, సీసీ రోడ్లు మంజూరు చేసిందని అన్నారు.ఈ ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, తిరుమల గిరి సాగర్ ఎంపీపి భగువాన్ నాయక్, ఏఈ రామకృష్ణ, కాంట్రాక్టర్ రామయ్య, జిల్లా నాయకులు రవి నాయక్, సర్పంచులు బాణావత్ శంకర్,నడ్డి లింగయ్య,మాజీ ఎంపీటిసి లక్షమయ్య, ఉపసర్పంచ్ చిరంజీవి, నాయకులు రవి నాయక్,ఎల్లయ్య గౌడ్,మోతిలాల్, బిక్కు, హరియ, మకత్ లాల్,గ్రామస్తులు పాల్గొన్నారు.