- Advertisement -
నవతెలంగాణ-తుంగతుర్తి: మండలంలో 21 ఐకెపి కేంద్రాల ద్వారా నేటి వరకు 1,14,756 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయగా,1,06,769 క్వింటాల ధాన్యం దిగుమతి చేశామని,19,967 క్వింటాల ధాన్యం లారీలు రాని కారణంగా కేంద్రాలలో ఉందని ఏపీఎం యాదమ్మ తెలిపారు.1659 మంది రైతుల నుండి ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులతో సంప్రదించామని,లారీలు సమయానికి రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమన్నారు. ఈ నెల చివరి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని,రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
- Advertisement -



