చరిత్ర సృష్టించిన మెండిస్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార సంగర్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 70 బంతుల్లో సంగర్కర సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగర్కర రికార్డును మెండిస్‌ బ్రేక్‌ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు.

Spread the love