నవతెలంగాణ హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత్ కు అథ్లెటిక్స్‌లో పతకాల వర్షం కురుస్తోంది. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్నాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా రజతం సాధించాడు. నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడిని పట్టేశాడు. పురుషుల 5 వేల మీటర్ల ఫైనల్‌లో అవినాశ్ ముకుంద్ సాబలే రజతం పతకం అందుకున్నాడు. అతడు 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. అవినాశ్‌కిది రెండో పతకం. 3 వేల మీటర్ల పరుగులో అతడు పసిడి గెల్చుకున్న సంగతి తెలిసిందే. మహిళల 800 మీటర్ల ఫైనల్‌లో హర్మిలన్ రజతం సాధించింది. 1500 మీటర్ల ఈవెంట్‌లోనూ ఆమె రజతం గెల్చుకున్న విషయం తెలిసిందే. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్‌లో కొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.