కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను తీసుకువస్తున్న మెటా…

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఓ కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఇన్ స్టాగ్రామ్ ను పోలి ఉంటుందని భావిస్తున్న ఈ యాప్ ట్విట్టర్ కు పోటీ ఇచ్చేందుకే రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త సోషల్ మీడియా సైట్ జూన్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఈ కొత్త సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ట్విట్టర్ తరహాలో టెక్ట్స్, టైమ్ లైన్ పోస్టులతో యూజర్లకు అందుబాటులోకి రానుంది. మెటా అధీనంలోని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ఎంత సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త వేదిక కూడా విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ కొత్త సైట్ కు ఇంకా నామకరణం చేయలేదు.

Spread the love