మైల్ స్టోన్ స్కూల్.. విద్యార్థులకు డైమండ్ స్టోన్

– కేరళ ప్రధానోపాధ్యాయునిచే నిర్వహణ
– ప్రతి విద్యార్థిపై ప్రత్యేక చొరవ
– స్వంత భవనంలో అన్ని వసతులు
– నర్సరీ నుండి 7వ తరగతి వరకు నాణ్యమైన విద్య
నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండల కేంద్రంలోని మైల్ స్టోన్ స్కూలు నర్సరీ నుండి ఏడవ తరగతి విద్యార్థులకు డైమండ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ నుంచి నాన్నమైన విద్య కొనసాగించాలంటే మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని తల్లిదండ్రులు ఉప్పునుంతల మండల కేంద్రంలోని మైల్ స్టోన్ పాఠశాలనే ఎంచుకొని విద్యార్థులను పాఠశాలకు పంపిస్తున్నారు. కేరళ ప్రధానోపాధ్యాయులు నిర్వహణలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపాల్ ఉన్ని కృష్ణ తెలిపారు. ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం ఏర్పాటు చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనునిత్యం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
స్వంత భవన పాఠశాల:
రెండు ఎకరాల్లో సువిశాలమైన స్వంత భవన పాఠశాలను ఏర్పాటు చేసుకొని విశాలమైన తరగతి గదులు అనునిత్యం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకొని విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ప్రీ- ప్రైమరీ విద్యార్థినీ విద్యార్థులుకు ఆటవసులతో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మినరల్ వాటర్ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విశాలమైన తరగతి గదులు:
పాఠశాలలో విశాలమైన తరగతి గదులు నిర్మించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి వాతావరణాన్ని సృష్టించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అదేవిధంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక అదనపు తరగతులు ఏర్పాటు చేసి వారిని ఎలాంటి భయాందోళన చెందకుండా మెరిట్ విద్యార్థులతోపాటు తీర్చిదిద్దుతున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ పై ఉన్న భయాన్ని తొలగించి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్నారు. ఇంగ్లీష్ హిందీ తెలుగు హ్యాండ్ రైటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు:
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన కొనసాగిస్తూ విద్యార్థులను షార్ప్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిరోజు ప్రార్థన మొదలుకొని పాఠశాల ముగింపు సమయం వరకు రకరకాల ఆక్టివిటీస్తో విద్యార్థులను ఇంప్రెస్ చేస్తూ విద్యా బోధన సాగిస్తున్నారు.
సొంత బిడ్డల్లా చూసుకునే ఆయా:
నర్సరీ నుండి మొదలుకొని యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు దాదాపు 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలు ఉండటం వల్ల వల్ల ఆలనా పాలన చూసుకోవడానికి పాఠశాలలో తప్పనిసరిగా ఆయా ఉండాల్సిందే కాబట్టి ఇక్కడ కొనసాగుతున్న ఆయా కూడా తన స్వంత పిల్లల్లా విద్యార్థులు ఆలనా పాలన చూసుకుంటుందని తెలిపారు.విద్యార్థులకు అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండ చూసుకునే ఏకైక పాఠశాల మైల్ స్టోన్ స్కూల్ అని యాజమాన్యం పూర్తి భరోసా కల్పిస్తున్నారు. అడ్మిషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో క్యాంపెనింగ్ చేస్తున్నామని తెలిపారు.అదే విదంగా కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నట్లయితే వెంటనే జాయిన్ చెయ్యాలని పాఠశాల యాజమాన్యం కోరారు.
Spread the love