– మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పీసీసీఎఫ్ డోబ్రియల్, అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం మరింత పెంచేందుకు కృషిచేస్తామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖకు పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.