మంత్రి కేటీఆర్ శుభవార్త..వారి అకౌంట్లో రూ. 3000

నవతెలంగాణ-హైదరాబాద్ :  జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభవార్త చెప్పారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం మన్నెగూడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి 3000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు. నేతన్నకు బీమాను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. చేనేత హెల్త్ కార్డులను కూడా ఇస్తున్నామని, అవుట్ పేషెంట్ చేనేతలకు ఇకనుండి 25 వేలు అందుతాయని చెప్పారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామని తెలిపారు. అలాగే టెస్కో పరిమితిని 25 వేలకు పెంచుతున్నామన్నారు. కేంద్రం తీరు చేనేత వద్దు అన్ని రద్దు అనేలా ఉందని మండిపడ్డారు.

Spread the love