9.7 జిపిఏ సాధించిన విద్యార్థిని అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – రామగిరి: రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపీటీసీ తీగల సమ్మయ్య స్వప్న గార్ల ద్వితీయ పుత్రిక తీగల శ్రీతన్వి ముదిరాజ్ సెంటినరీ కాలనీలోని వాణి సెకండరీ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థినికి నిన్న వెలువడినటువంటి పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి9.7 సాధించి పట్టణ టాపర్ గా నిలిచినందుకు గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, సూచిస్తూ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఉన్నత చదువుతోపాటు దేశానికి సేవ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎల్ల శశిరేఖ రామ్మూర్తి, వనం రామచంద్ర రావు,బివి స్వామి గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, ఎరుకల బాబురావు, ఎండి చాంద్ పాషా, ఎంపీటీసీలు కొప్పుల గణపతి, కొట్టే సందీప్, జనగామ బుచ్చి బాబు, చిందం మహేష్ పటేల్, మాజీ సర్పంచులు దేవునూరి రజిత శ్రీనివాస్, మాజి జడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి, తోట చంద్రయ్య, కాటం సత్యం, విద్యార్థిని శ్రీ తన్విని అభినందించారు.

Spread the love