- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ సీఎంగా వీడీ సతీశన్ మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే విధంగా యూడీఎఫ్ సర్కార్ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే సంఖ్య బలాన్ని ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు శనివారం వీడీ సతీశన్ మీడియాకు తెలియజేశారు. మే 18న తనతో పాటు మంత్రుల బృందం ప్రమాణస్వీకారం చేయనుందని స్పష్టం చేశారు. గత నెలలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరగ్గా..కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
- Advertisement -



