మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు..!

– మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం
– ఆరు గ్రామాలకు తాగు నీళ్లు బంద్
– పంట పొలాల మీదుగా పగిలిన భగీరథ పైపు లైన్లు
– శాశ్వత పరిష్కరం చూపాలని వినతి
నవతెలంగాణ – పెద్దవూర
మిషన్ భగీరద అధికారుల అలసత్వం, కాంట్రాకటర్ల నిర్లక్ష్యం, కారణంగా పెద్దవూర మండలం లో మిషన్ భగీరథ పైపు లైన్లు పంట పొలాల నుంచి వేయడం తో అవి తరచూ పగిలి పోతున్నాయి. భూగర్భ జలాలు అడగంటడం తో బోర్లు వట్టిపోతున్నాయు. దాంతో రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో పంట పొలాల మీదుగా కొత్తగా బోర్లు వేసి పైవు లైన్లు వేసే క్రమంలో మిషన్ భగీరద పైపులైన్లు పగిలి పోతున్నాయి. ఈ నెల 20 పర్వేదుల నుంచి నాయిన వాణికుంటే గ్రామానికి వేసిన పైవు లైన్లు నాయిన వాణికుంట తండా సమీపంలో పగిలి పోయాయి.తాండకు చెందిన ఓ రైతు తన పంట పొలానికి బోరు వేసి పైపు లైన్ వేసుకుంటున్న క్రమంలో మిషన్ భగీరద పైపు లైన్లు పగిలి పోయాయి. దాంతో మండలం లోని పాత జయరాం తండా, కొత్త జయరాం తండా, పర్వేదుల, నాయినా వాణికుంట కుంట, నాయిన వాని కుంట తాండకు గత మూడు రోజులుగా ఈ ఐదు గ్రామాల్లో నీళ్లు రావడం లేదు. ముఖ్యంగా నాయిన వాని కుంట గ్రామంలో తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. గ్రామం లో గ్రామమ పంచాయతీ బోరు పనిచేయడం లేదు.
చేతి పంపులు పనిచేయడం లేదు. అంతే గాక చేతి పంపులు చేయక ముందే చేసినట్లు గ్రామస్తుల నుంచి మరమ్మతులు చేసామని కార్యదర్శి సంతకాలు తీసుకున్నారని,గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మరమ్మత్తులు చేశామని చెప్పడం తో సంతకాలు చేశామని గ్రాస్తులు చెపుతున్నారు. చేతి పంపులు, మరమత్తులు చేయక, మిషన్ భగీరద నీళ్లు రాక, గ్రామ పంచాయతీ బోరులో పైపులు వేయక తాగునీటితో పాటు, కనీస అవసరాలకు, కూడా చుక్క నీళ్లు రావడం లేదు కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేవని వాపోతున్నారు. మిషన్ భగీరద పైపు లైన్లు గత ఏడేళ్ల క్రితం కాంట్రాకటర్లు ఆరు అడుగుల లోతులో వేయాసిన పైపు లైన్లు రెండు కిలోమీటర్లు దూరం ఫీటున్నర లోతులో కూడా వేయక పోవడం తో తరచూ ఒక నెల వ్యవది పైపు లైన్లు మూడు, నాలుగు సార్లు పగిలి పోవడం తో తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదు.ఈ సమస్యల నెలలో రెండు మూడు సార్లు ఎదో ఒకచోట రైతుల పంట పొలాల వద్ద చోటుచేసుకోవడం తో త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గాను శాశ్వత పరిష్కరం చూపాలని,పంట పొలాల మీదుగా మిషన్ భగీరథ నీటీ పైపు లైన్లు సంభందిత అధికారులు వేయడం తో తాగునీటికి ఇంత ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని గ్రామాల్లో పంచాయతీ బావుల నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి అవకాశం లేని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నీటి సమస్యను తీర్చాలని, తరచూ పైపు లైన్లు పగలకుండా తగిన విదంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

Spread the love