బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి

బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నవతెలంగాణ చిట్యాల:                                                                         సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో ఆడపడుచులతో నకెరెకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి బతుకమ్మ లో పాల్గొన్నారు.అనంతరం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని, దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందని పేర్కొన్నారు.సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని చెప్పారు.

Spread the love