పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – శంకరపట్నం
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మంగళవారం శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవనం ప్రారంభించారు. అనంతరం మొలంగూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణం కోసం భూమిపూజ చేసి నూతన అంబేద్కర్ విగ్రహన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తాడికల్ గ్రామ సర్పంచ్ కీసర సుజాత- సంపత్, మొలంగూర్ గ్రామ సర్పంచ్ మోరి అనూష- శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, తాసిల్దార్ అనుపమ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగోపగాని బసవయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love