బక్కారావు పద్మ దంపతులను పరామర్శించిన: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 

నవతెలంగాణ – మల్హర్ రావు
ఈనెల 21న  మహా ముత్తారం మండలంలోని మీనాజీ పేట, కిష్టాపూర్ లో బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల పరస్పర దాడుల్లో తీవ్రంగా గాయపడిన మంథని ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామ సర్పంచ్ బక్క రావు పద్మ దంపతులు వరంగల్  అజారా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకొన్నారు.వారికి  మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.అదైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంటా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love