పాయం ఇలవేల్పు.. రణాసురుడి జాతరకు రేపు ఎమ్మెల్యే రాక

– అంగరంగ వైభవంగా సాగుతున్న జాతర కార్యక్రమాలు
– జాతరలో కొనసాగుతున్న వాలీబాల్ పోటీలు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల పరిధిలోని నడిమిగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పాయం వంశీయుల ఇలవేల్పు రణాసురుడి జాతరకు గురువారం పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరుకానున్నారని స్థానిక పాయం వంశీయులైన రామనర్సయ్య, నర్సింహారావు, సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జాతర 23వ తేదీ వరకు జరుగుతుందన్నారు. రణాసురుడు దైవాన్ని నమ్ముకున్న భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని పాయం వంశీయుల దృఢమైన విశ్వాసమని వ్యాఖ్యానించారు. భక్తులందరూ ఆదిపరాశక్తి రణాసురుడుని దర్శించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ మహా జాతరకు వచ్చి సావిత్రి, గాయిత్రి, సరస్వతి, భవాని, రణాసురుడు దైవాలను దర్శించుకొని మొక్కకున్న భక్తులకు దీర్ఘకాలిక వ్యాధులు, సంతాన ప్రాప్తి, సర్వరోగ నివారణ, గ్రహశాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఆశించిన పనులు సైతం జరుగుతాయని తెలిపారు. జాతర ప్రారంభమైన మంగళవారం కర్ర దింపుట, దేవుడికి కుంకమ పూజలు, గుడి మేలుకొలుపు కార్యక్రమాలు కాగా, ఒకపొద్దు రణాసురుడు దేవరగుట్ట పై నుంచి బుధవారం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటలలోపు గర్భగుడికి  రావడం జరిగిందన్నారు. వనదేవత దేవక గుట్ట పై నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గర్భగుడికి వస్తుందని, రాత్రి 12 గంటలకు గంగాస్నానం ఉంటుందని, శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు మండ మేలుగుట అనంతరం భక్తులు మొక్కులు చెల్లించే కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. చివరిరోజు శనివారం దేవుడు గుడి నుండి గుట్టకు వెళ్లడం జరుగుతుందని జాతర కార్యక్రమాలు తెలిపారు. ఈ జాతరకు తలపతులుగా పాయం బొర్రయ్య, పాయం పెద్ద పాపయ్య, సీతయ్య, క్రిష్ణ మూర్తి, బుచ్చయ్య, సత్యం, అంజిబాబు, కనకయ్యలు కాగా వడ్డెలుగా మలకం పాపారావు, డోలీ వాయిద్యాలు డిల్లీ రాములు, శివపు వడ్డెగా పాయం రామయ్య వ్యవహరిస్తారని  పేర్కొన్నారు. అదేవిధంగా ఈ మహా జాతర సందర్భంగా 8 మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆళ్ళపల్లితో పాటు గుండాల, కరకగూడెం, పినపాక, టేకులపల్లి, లక్ష్మిదేవిపల్లి, తాడ్వాయి, మంగపేట ఉండగా, ఎంట్రీ ఫీజు రూ.250లు ఉన్న ఈ టోర్నీలో సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు 9398942753, 9440806120, 9490991359, 6300695054 కాగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.18,116లు రూ.10,116లు, రూ.5,116ల నగదు ఉందని చెప్పారు. ఈ జాతర ఆలయ కమిటి సభ్యులుగా పాయం రాంబాబు, నాగేశ్వరరావు, రాజబాబు, సోమయ్య, పాపారావు, హనుమంతరావు, పాపయ్య, నాగయ్య, రాజు, తదితరులు ఉన్నారు.
Spread the love