Sunday, May 17, 2026
E-PAPER
Homeఖమ్మంసోమవారం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన

సోమవారం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన

- Advertisement -

– రూ.1.80 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో సోమవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించనున్నట్లు ఆయన క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 80 లక్షల వ్యయంతో చేపట్టిన, చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో నిర్వహించే ‘ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ’ 2కే రన్‌లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం ఉదయం 9 గంటలకు పాతరెడ్డిగూడెంలో నిర్మించిన సీసీ రోడ్లు, నడిమిరెడ్డిగూడెంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను ప్రారంభిస్తారు.

ఉదయం 10:15 గంటలకు అసుపాకలో సీసీ రోడ్లు, ఉదయం 10:45 గంటలకు బచ్చువారిగూడెం, అసువారిగుంపులో సీసీ రోడ్లు, చిచ్చుడిగుంపులో ప్రాథమిక పాఠశాల భవనం మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మధ్యాహ్నం 12:15 గంటలకు గుమ్మడివల్లిలో సీసీ రోడ్లు, మధ్యాహ్నం 1:15 గంటలకు కోయరంగాపురం, వడ్డెరంగాపురంలో సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు నారాయణపురంలో కమ్యూనిటీ హాల్ మిగిలిన పనులకు శంకుస్థాపన చేసి, మధ్యాహ్నం 2 గంటలకు అదే కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించనున్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా, యువజన అధ్యక్షులు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు, పార్టీ సేవాదళ్ అధ్యక్షులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ బాధ్యులు వట్టి వెంకట్రావు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -