ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యుడి భగభగలకు అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నేడు, రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడుతాయని ప్రకటించిన వాతావరణ శాఖ… ఎల్లుండి మాత్రం పొడి వాతావరణ నెలకొనే అవకాశం ఉందని వివరించింది. రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని… హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ కబురుతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. రోజూ భానుడి సెగలకు తట్టుకోలేకపోతున్నమని.. వాతావరణం కాస్త చల్లబడుతుందనే వార్త ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు.

Spread the love