మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 

– యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ 
నవతెలంగాణ నెల్లికుదురు 
నీట్ పేపర్ లీకేజీ దేశ ప్రధాని మోడీ నిర్లక్ష్యం వల్లనే లీకేజీ అయిందని నిరుద్యోగులను మోసం చేసిందని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నెల్లికుదురు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర యూత్ అధ్యక్షులు శివసేన రెడ్డి  పిలుపు మేరకు, జిల్లా యూత్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి ఆదేశాలనుసారంగా, శాసనసభ్యులు శ్రీ డాక్టర్ భూక్య మురళి నాయక్  ఆదేశాల మేరకు అంబేద్కర్ సెంటర్ వద్ద శుక్రవారం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం అనంతరం జిల్లా యూత్ నాయకులు మాట్లాడుతూ..  దేశవ్యాప్తంగా ఎన్ టి ఏ, (NTA) ద్వారా జరిగిన నీట్ ఎగ్జాంలో అవకతవకల వల్ల 23 లక్షల మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. అని ఆవేదన వ్యక్తం చేశారు, ఎంతో మంది నిరుపేద కుటుంబాలు చెందిన నిరుద్యోగులు కూలి పని చేసుకుని ఆన్లైన్లో ఫీజు కట్టి పరీక్షకు ఎన్నో రోజుల నుండి ప్రిపేర్ అయ్యి కష్టపడి పరీక్ష రాస్తే దాని ఫలితం లేకుండా పోయిందని నిరుద్యోగులు మోసం చేశారని మోడీప అగ్ర వ్యక్తం చెందినట్లు తెలిపారు.  ఇప్పటికి కూడా  మోడీ పట్టించుకోకపోవడం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీడ్స్ క్యాంపై మాట్లాడకపోవడం వలన  దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు బలవుతున్నారు అన్నారు బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇదేమి పట్టనట్టుగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు  ప్రాంతీయ పార్టీల అండతో వారి యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం మారుతుందని మోదీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని బిజెపి కార్యాలయాన్ని చుట్టుముడతామని అన్నారు ఇలాగే విద్యార్థులను మోసం చేస్తే ఎన్నో రకాలైన నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. లంచాలకు అలవాటు పడి లక్షల రూపాయలను తీసుకొని పేపర్ లీకేజీ వెనకాల ఉన్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే మళ్ళీ దురద గతిలో ఈ యొక్క నీట్ పరీక్ష ని పునరుద్ధరించాలని, డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో. యూత్ ప్రధాన కార్యదర్శి చిన్నబోయిన శ్రీనివాస్ శేఖర్ మురళి నవీన్ సందీప్ భాస్కర్ నాయక్ బొల్లు లింగమూర్తి సుధీర్ యుగంధర్  ఉమేష్   తదితరులు పాల్గొన్నారు.
Spread the love