– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ
– బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ధ్వజం
– బీజేపీ హఠావో..దేశ్ కి బఛావో అంటూ పిలుపు
– ప్రజలను పట్టించుకోని పార్టీలకు ఓట్లడిగే హక్కేలేదని స్పష్టం
– ప్రజా ప్రభుత్వానికి బలానిచ్చే కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్థన
– ఇండియా కూటమితోనే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని హెచ్చరిక
– కూటమిలో బాగాస్వాములను కలుపుకోవాలని హితవు
నవతెలంగాణ – బెజ్జంకి
మోడీ అంటే మోసమని..కేసీఆరంటే నియంతృత్వమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. ఇండియా కూటమి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని సీపీఐ,కాంగ్రెస్,సీపీఐ(ఎం)శ్రేణులతో కలసి గురువారం మండల కేంద్రంలో బ్యాలెట్ నమూనతో చాడ వెంకట రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.అనంతరం స్థానిక నర్మద గార్డెన్ యందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకట రెడ్డి మాట్లాడారు.పదేళ్లు బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు పరిపాలన సాగించి నియంతృత్వంతో ప్రజలను నిర్భందించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసాయని ధ్వజమెత్తారు.బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతూ తన రాజకీయ అవసరాలకు మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపోందాలని చూస్తోందన్నారు.భారత దేశం ప్రమాధపుటంచుల్లో ఉందని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరలందరూ తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హఠావో..దేశ్ కి బచావో నినాదం తీసుకుని బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి బాగాస్వాములకు పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలను తరించే ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటుకావాలని కమ్యూనిష్టులు చేసిన పోరాటాల పలితమే నేడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వమని..ఇప్పుడు ప్రజల ప్రభుత్వాన్ని కళ్లారా చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో గత బీఆర్ఎస్,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలవి స్వార్ధ ప్రయోజనాలేనని అన్నారు.కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం బండి సంజయ్ ఏమీ చేయలేదని..అభివృద్ధి,ప్రజా సంక్షేమాన్ని, సమస్యలను పట్టించుకోకుండా విస్మరించిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ప్రజలను ఓట్లడిగే హక్కేలేదని స్పష్టం చేశారు.ఇండియా కూటమితోనే దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని హెచ్చరించారు.
కూటమిలోని బాగాస్వాములను కలుపుకునిపోయి సమిష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వానికి బలాన్నిచ్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలింపించాలని కాంగ్రెస్ నాయకత్వానికి హితవు పలికారు.బెజ్జంకి మండలంలో ఇండియా కూటమి భారీ మేజారిటీ సాధించాలని సూచించారు.సీపీఐ కరీంనగర్,సిద్దిపేట జిల్లాల కార్యదర్శలు మర్రి వెంకట స్వామి,మంద పవన్,జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకట రెడ్డి,అన్నాడి మల్లారెడ్డి,సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్,ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బోనగిరి మహేందర్,న్యాలపట్ల రాజ్,సీపీఐ(ఎం)నాయకుడు బోనగిరి లింగం,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానగొండ శ్రవణ్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణీ పోచయ్య,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,నాయకులు ఐలేని శ్రీనివాస రెడ్డి,జెల్లా ప్రభాకర్,మెట్ట నాగారాజు,బొనగం రమేశ్,ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు దొంతరవేణి మహేశ్,అంతటి రాకేశ్,బాలమల్లు,బైరి లచ్చయ్య,సీపీఐ మహిళలు పాల్గొన్నారు.