29న విద్యార్థులతో మోడీ ‘పరీక్షా పే చర్చ’…

Pariksha-Pe-Charchaనవతెలంగాణ – ఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ  చేపట్టిన ‘పరీక్షా పే చర్చ’  కార్యక్రమం తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోడీ ముఖాముఖి నిర్వహిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొనేందుకు అర్హులు. ఈ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. దీని చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు.

Spread the love