ఇక చంద్రుడి టైమ్‌ వస్తోంది..

 

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోనో.. రష్యాలోనో లేదా ఇతర దేశాలలో ఇప్పుడు టైం ఎంతైందో.. అని మనం అనుకుంటుంటాం. భవిష్యత్తులో చంద్రుడిపై టైమ్‌ ఎంతైందో అనుకోవాల్సిన పరిస్థితి కూడా రానుంది. జాబిల్లి, ఇతర గ్రహాలపై సమయం తెలుసుకొనేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైమ్‌ను నిర్ధరించాలని శ్వేత సౌధం నుంచి నాసాకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. చంద్ర యాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీపడుతున్న తరుణంలో ఈ ఆదేశాలు వెలువడం గమనార్హం.

Spread the love