విశాఖ నుంచే పాలన ..తేల్చి చెప్పిన సీఎం జగన్

నవతెలంగాణ విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖ పట్టణం ఉంటుందని.. తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖలోనే ఉంటానని అన్నారు. అంతకు ముందు.. రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు 90శాతం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని తెలిపారు. అలాగే రానున్న కాలంలో తాను మరోసారి సీఎంగా వచ్చి విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక నా వ్యక్తిగత స్వార్ధమేమి లేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌ అభివృద్ధి చెందుతుంది. అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదని చెప్పిన ఆయన అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందని తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నాం. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖకు కనెక్టివిటినీ మెరుగు చేశాం.. అంటూ అనేక హామీలు గుప్పించారు.

Spread the love