బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే మరిన్ని పథకాలు

– ఎన్నికల ప్రచారంలో కమల్‌ రాజు
నవతెలంగాణ-చింతకాని
రాష్ట్రంలో మరిన్ని పథకాలు అమలవుతాయని బీఆర్‌ఎస్‌ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌ రాజు పేర్కొన్నారు. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగుతా యని అన్నారు. మంగళవారం చింతకాని మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌ రాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన వాటిని సమకూర్చానని వివ రించారు. మీకు మరింత సేవ చేసేందుకు ఈ ఎన్నికల్లో మీ ఆశీ ర్వాదం కావాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల మాట్లాడుతూ కమల్‌ రాజు గెలుపు మధిర అభివృద్ధికి మలుపు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపిపి పూర్ణయ్య, వైస్‌ ఎంపిపి హనుమంతరావు, జడ్పిటిసి కిషోర్‌, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Spread the love