చీకటి చుట్టిన జీవన పయనంలో వెన్నెల
రెక్కలు కట్టి తలుపు తడితే..
మది నిద్దుర మరచిన కన్నుల్లోకి
ఇంద్ర ధనస్సు వచ్చి పలకరిస్తే..
చెలిమి తాకిన హదయ రాగంలో
అనురాగపు మధురిమలు
ఆప్యాయతను అల్లుకొని..
మమతలన్నీ తీగలా చుట్టుకున్నాయి..
వెన్నెలను ఎక్కుపెట్టిన ఆ నిశి రాతిరి
అద్భుతమైన స్వప్న లోకంలో విహరింపజేసింది…
జీవితాన్ని సరికొత్తగా మార్చేసింది.
మెలుకువ రాగాలు కంటి రెప్పలని
తట్టి లేపుతూన్నాయి..!!
కలలకు ఇపుడు కొత్తగా
వెలుగు రేఖలు పూస్తున్నాయి.!!
– స్వప్న మేకల, 9052221870