మనిషిని మనిషిగా బ్రతకనివ్వని ఓ మనిషి..
మానవత్వం,మనిషితత్త్వం నీలోన వెతకక…
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో వెతికి…
ఎక్కడా లేదంటు నిట్టూర్చి నీల్గుతూ…
రచనలే చేసేవు,రాగాలు తీసేవు…
మార్పు మార్పంటూ గోల చేసేవు…
మార్పన్నది అవసరం…
నీకు కాక అందరికీ…
తప్పన్నది చేస్తారు…
నువ్వు కాక అందరూ..
మనసన్నదే లేదు…
నీకు తప్ప ఎవ్వరికీ…
అనుకుంటూ గడిపేవు ఏళ్లకు ఏళ్ళు…
కలగంటు మరిచేవు నిజానిజాలు..
మార్పన్నదితెస్తే కాగలవో లేదో మహాత్ముడివి
అది నీలో వస్తే తప్ప కాలేవు మనిషివి…
మహాత్ములు కాలేని మనుషులెందరున్నా
బ్రతికి ఉంటుందేమో మానవత్వం..
మనుషులు కాలేని మహాత్ములెందరైనా
బ్రతికించలేరు ఇది సత్యం…
– కె.ఉమా
6301861963