శతాబ్దాల శాస్త్రీయ దక్పథంతో
హేతుబద్ధ ఆలోచనలతో
దశాబ్దాల తరబడి
వేలాది శాస్త్రవేత్తల కషి
అధ్యయనాలు ప్రయోగాలు
పరిశీలనలు అనుభవాలు
సోపానాలుగా చేసుకుని
ముందుకు సాగిన పయనం
విజయాలను అపజయాలను
పునాదులుగా వేసుకుని
నిప్పులు చెరుగుతూ నింగికెగసిన చంద్రయాన్
రోజులూ గంటలూ గడిపిన
ఉత్కంఠతకు తెర తీస్తూ
ఇంతవరకు ఏ దేశం చేరని
చంద్రుని దక్షిణ ధ్రువం పైకి చేరడం
చంద్రయాన్ విజయం
ఇస్రో చరిత్రలో ఒక మైలురాయి
భారతీయులకు గర్వకారణం
భావితరాలకు ప్రయోజనకరం
చంద్రుని గుట్టు విప్పడానికి
మరింత సమాచార సేకరణకి
విశ్వ రహస్యాలు రాబట్టడానికి
మరెన్నో వింతలు తెలుసుకోవడానికి
అద్భుత ఘటన ఆవిష్కరణ
అంతరిక్ష చరిత్రలో
ఇస్రోకు దక్కిన ఘనత
కొత్త అధ్యయనానికి శ్రీకారం
సాంకేతికాభివద్ధికి మరో ముందడుగు
ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన
అపూర్వ సంఘటన
భారతీయుల సంబరాలు
అంబరాని అందుకున్న వేళ
మువ్వన్నెల జెండా
రెపరెపల ఆనంద డోల
శాస్త్రవేత్తల కషి అభినందనీయం
ఇది సైన్సు సాధించిన విజయం
– పి. రామనాధం
భద్రాద్రి కొత్తగూడెం