మృత్యుస్పర్శ

పదిలక్షల సూటు వేసుకొని
యాబయారించుల ఛాతి
మొసలికన్నీరు నాయకుడు
పై దుస్తులు ఒలిచాడు
చీరా లాగేశాడు
లో దుస్తులు గుంజేశాడు
ప్రపంచ బహిరంగ మార్కెట్లో
బహిరంగ అసభ్య చేష్ఠల
ట్రంపు ప్రియుడు
భారతమాతకు జై అంటూనే
భూమంతా
నగంగా తిప్పాడు

యథా నాయక
తథా కార్యకర్త

పై దుస్తులు ఒలిచారు
చీరా లాగేశారు
లో దుస్తులు గుంజేశారు
మతం మార్కెట్లో
మణిపూర్‌ మాతను
వాళ్ళుపుట్టిన మార్గాన్ని పొక్కిలి చేస్తూ
నగంగా తిప్పారు

వాడు దేశాన్ని
వాళ్ళు దేహాల్ని

రోజూ నలభైవేల అల్పాహారం తింటూ
అంగాంగం అంగట్లో పెట్టినోని అనుచరులారా!
అమ్మతనాన్ని ఛిద్రంచేయడమే
మగతనం అనుకునే మతమగాల్లారా!

నడిబజార్లో
ఇనుప గొల్సుల చేతుల్తో
అమ్మల రొమ్ములు పట్టుకున్నోన్ని
వాళ్ళమ్మ పాలకు బదులు
ఉచ్ఛపోసి పెంచుంటది

బహిరంగంగా
అమ్మల జననావయవాల్లో
చేతులు ముంచిన వాళ్ళు
పియ్యి తిని పెయ్యి పెంచుంటారు పందుల్లా!

హిందూ తాలిబన్లారా!
యూదు స్త్రీల నగ ఊరేగింపులా
మీరు పాలు తాగిన రొమ్ముల్ని
మీ జనన జననంగాల్ని
మీ తల్లుల్ని మీ చెల్లెల్ని మీ భార్యల్ని
మీ భారతమాతను నగంగా ఊరేగించారు
సిగ్గును కాశీలో వదిలి
శరాన్ని గంగలో తోసి

హిందూ నాజీల్లారా!
హిట్లర్‌ ముస్సోలినిల కుక్కచావులు
ఇవ్వాళ ఇప్పుడే కాకపోవచ్చు
కళ్ళు కాయలు కాసేలా
మీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి
– వడ్డెబోయిన శ్రీనివాస్‌

Spread the love