ఆటల్లో రాణింపు..పతకాల గుబాలింపు

రంగమైదేనా… సంకల్ప శక్తితో రాణించవచ్చు అని నిరూపించాడా యువకుడు. నిరంతర శ్రమ, పట్టుదలతో… సిద్దిపేట క్రీడా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు నాయిని గోవర్ధన్‌ రెడ్డి. చిన్న వయసులోనే సిద్దిపేట జిల్లా నలుమూలల ఆటై విస్తరించాడు. తనతోపాటం తన విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు. గోవర్ధన్‌ రెడ్డి పరిచయం ఈ వారం జోష్‌.. 
మా గురువే మాకు ఆదర్శం, ఆయనే స్ఫూర్తి అని తెలిపారు. ఆయన దగ్గర నుండి ఎన్ని మంచి విషయాలను నేర్చుకున్నాం. సమాజంలో ఎలా ఉండాలి ,ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి అని అన్ని మాకు గోవర్ధన్‌ సార్‌ ఒక అమ్మలా అన్ని నేర్పించారు.
క్రీడల్లోనే కాకుండా చదువులో కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్‌ చేసేవారు. మా గురువుగారి వలనే మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. ఎంతో మందీ విద్యార్థులను జాతియ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. మేము మంచిగా కష్టపడి మంచిగా ఉన్నత స్థాయికి ఎదిగి మా గురువు గారి పేరు నిలబెడుతం అని వారి విధ్యార్థులు తెలిపారు.
జిల్లాలో ఏ క్రీడా పోటీలు జరిగినా పతకాల గుబాళింపు తన విద్యార్థులదే. ఏ క్రీడా కార్యక్రమం జరిగినా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏ సాహిత్య కార్యక్రమాలు జరిగినా కవిత్వమా గుబాళిస్తాడు. అందుకే ఈ పేరు వింటే సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, సాహిత్యకారులు ఒక్కసారిగా మురిసిపోతారు. అలా అతడొక అద్భుతం… ఒక మంచి గురువుగా అతని పాత్ర ఒక అనిర్వచనీయం. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న ‘ఆయన’ క్రీడా రంగంతోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. వివక్షతలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పేరుపొందిన యువకుడు నాయిని గోవర్ధన్‌ రెడ్డి.
ఆయనది మెదక్‌ జిల్లా శివంపేట మండలం కొత్తపేట్‌ గ్రామం. అమ్మ తారమ్మ, నాన్న జనార్ధన్‌ రెడ్డి. అక్క గీత తమ్ముడి ఆసక్తిని నిరంతరం ప్రోత్సహిస్తుంది. 2016లో కీర్తనతో వివాహమైంది. వీరి ఏకైక కుమార్తె ప్రణవి. గోవర్ధన్‌ ప్రతి విజయం వెనుక ఆమె అందించిన సహకారం ఎంతో గొప్పది.
వత్తి నేపథ్యం
పాఠశాల స్థాయి నుండి వాలీబాల్‌ ఆటపై ఆసక్తితో అనేక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బి.పి.ఇడి) కోర్సును పూర్తి చేసి 2012 డి.ఎస్సీ ద్వారా ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 2012 నుండిZPHS ఏటిగడ్డ కిష్టాపూర్‌ మండలం, తొగుట, సిద్దిపేట జిల్లా నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ పాఠశాల నుండి అనేక మంది విద్యార్థులను, క్రీడాకారులుగా తయారు చేసి వివిధ క్రీడలలో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గోనేలా కషి చేశాడు.
వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, యోగ, నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌ వాలీబాల్‌, సాఫ్ట్‌ బాల్‌, హ్యాండ్‌ బాల్‌, ఆథ్లెటిక్స్‌, మొదలగు క్రీడలలో జాతీయ స్థాయికి 30 మంది, రాష్ట్రస్థాయి పోటీలకు 150 మందికి పైగా క్రీడాకారులను పంపించాడు. అనేక రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు కోచ్‌గా, అబ్జర్వర్‌గా వ్యవహరించాడు. మండల స్థాయి నుండి జాతీయ స్థాయి పోటీల్లో ఆ పాఠశాల క్రీడాకారులను విజేతలుగా నిలపడంలో గోవర్ధన్‌ కషి చాలా కీలకం. 2000లో2000ýË Minastary of youth affirs and Sports నిర్వహించిన online sports training సర్టిఫికెట్‌ పొందాడు.
సిద్దిపేటలో జిల్లాస్థాయి ఖో-ఖో పోటీల్లో ఏటిగడ్డ కిష్టాపూర్‌ బాలబాలికల జట్లు తతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.SGF జిల్లా స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఆయన చేసిన కషికి 2015లోCM Friendly Policing cup Tournament ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి ఉత్తమ రెఫరీ అవార్డు అందుకున్నాడు. 2016లో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంఈఓ యాదవరెడ్డి నుండి అవార్డు అందుకున్నాడు. సంగారెడ్డి 2018లో జోనల్‌ స్థాయి వాలీబాల్‌ క్రీడలో under-14 బాలికల విభాగాలలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లాలో 2018లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుడు అందుకున్నాడు. గజ్వేల్‌ లైన్స్‌ క్లబ్‌ స్నేహ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నాడు.
2018లో ఏటిగడ్డ కిష్టాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలోSGF జిల్లా వాలీబాల్‌ పోటీలు రెండు రోజుల పాటు గోవర్ధన్‌ నిర్వహిస్తే అందులో అండర్‌ -14, అండర్‌ -17 బాలబాలికల విభాగంలో 150 జట్లు పాల్గొన్నాయి. 2019 సం||లోSGF63 వ జోనల్‌ ఖో-ఖో టోర్నమెంట్‌ కమ్‌ సెలెక్షన్స్‌, నెట్‌ బాల్‌, టెన్నీస్‌, వాలీబాల్‌ రాష్ట్ర స్థాయి క్రీడలకు అండర్‌-14 డ అండర్‌- 17 బాల బాలికల విభాగంలో సెలక్షన్స్‌ను నిర్వహించారు. ఆ పాఠశాల నుండి 14 మంది క్రీడాకారులు వ్యాయామ విద్యా కోర్సులను పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించారు. 2022 లో కేరళలో జరిగిన ఆల్‌ ఇండియా సివిల్‌ సర్సీసెస్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నారు.
సాహిత్యకారుడిగా
వ్యాయామ ఉపాధ్యాయుడే కాకుండా అతనికున్న సాహిత్యాభిలాషతో సాహిత్యరంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ధరిత్రి సాహితీ సమూహం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ”చిత్తు కాగితం” అనే కవితకు గాను రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అందుకున్నాడు. మూఢ నమ్మకాలు అనే కవితకు గాను తెలంగాణ సాహితీ యువ సమూహం వారిచే ప్రథమ బహుమతిని అందుకున్నాడు. 2018లో అనేక సామాజిక అంశాలతో కూడిన గోవర్ధన్‌ రెడ్డి కవితా సంపుటి ‘కందిలి’ని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం ఆవిష్కరించారు.
అతని విద్యార్థులిప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులు
2012 నుండి ఇప్పటి వరకు వ్యాయామ ఉపాధ్యాయుడిగా తమ గురువుని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని 20 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం పీటీ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.
క్రీడాజ్యోతి స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, ఇతర కార్యక్రమాలు :
క్రీడాజ్యోతిsports foundation స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు గోవర్ధన్‌ రెడ్డి. kreeda Jyothi foundation ద్వారా పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలనుExams pads ను పంపిణీ చేసాడు.TNF వారిచే 50,000/- రూ.ల విలువైన బెంచీలు, నోట్‌ బుక్స్‌ ను అందించారు.
ప్రభు అనే క్రీడాకారుడికి DPED చదువుకై దాతల సహకారంతో 30,000/- రూ. ఇప్పించాడు. అదే విధంగా జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రతి ఒక్కరికీ అందించాడు. రూ.2,000 /- ఖర్చుల నిమిత్తం అందించాడు.
పాఠశాల పూర్వ విద్యార్థుల ద్వారా రూ.10,000/- విలువైనSound system ఇప్పించాడు.Loins club of Siddipet వారి సౌజన్యంతో పాఠశాలకు నోట్‌ బుక్స్‌ ఇప్పించాడు.
అనాధ పిల్లలకుLoins club వారిచే, పాఠశాల ఉపాధ్యాయుల నుండి రూ.20,000/- ఇప్పించాడు. పాఠశాలకు అవసరమైన క్రీడా సామాగ్రి, శానిటేషన్‌ మెటీరియల్స్‌ రూపాయలు సుమారుగా 50,000/- రూ, స్పాన్సర్స్‌ ద్వారా తీసుకువచ్చారు.
kreeda Jyothi Sports foundation ద్వారా పేద క్రీడాకారులకు వారి చదువుల నిమిత్తం ఆర్థికంగా వారికి సహాయం చేసాడు. క్రీడా జ్యోతి sports foundedtion ద్వారా Summer camps, Tournaments నిర్వహించాడు.
క్రీడాజ్యోతి సౌజన్యంతో గజ్వేల్లోని IOC గ్రౌండ్‌Summer camp, ఖో-ఖోtounamen నిర్వహించాడు. Sports Foundation ఆధ్యార్యంలో క్రీడాకారులకు టీషర్ట్స్‌ పంపిణీ చేసాడు. ఇలా ఎంతో మంది క్రీడాకారులకు ఆర్థిక చేయూతనందించాడు.
2012- 2021 వరకు జి.ప.ఉ.ప ఏటిగడ్డ కిష్టాపూర్‌ పాఠశాలలో విధులు నిర్వర్తించాడు. 2021 – 22 లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు, బాలుర పాఠశాలలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించారు. ఆ సమయంలో జాతీయ స్థాయిలో ఇద్దరు విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో 10 మంది విద్యార్థులను పాల్గొన చేసాడు. 2022-23 నుండి ఇప్పటి వరకు జి.ప.ఉప ఆర్‌ డ ఆర్‌ కాలనీ, గజ్వేల్‌ నందు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తూ, జాతీయ స్థాయి క్రీడలలో ఒకరు, రాష్ట్ర స్థాయి క్రీడలలో 8 మంది విద్యార్థులను పొల్గొనచేసాడు మన వ్యాయామ ఉపాధ్యాయులు నాయిని గోవర్ధన్‌ రెడ్డి.
– అనంతోజు మోహన్‌ కృష్ణ

Spread the love