ఎన్నో కలలు
కలలనే వెంటాడుతుంటే
కాలం కత్తి లా
గుచ్చుకుంటుంది…
మనసు మబ్బుల్లా
దూది పింజమ్లా తెలుతుంటే
వ్యధ భారం బరువెక్కి
చీకటి వెలుగును కమ్మేస్తుంది…
వెక్కి వెక్కి ఏడుస్తున్న కళ్లు
కన్నీళ్లు నిండుకొని
ఆనందం పోయి
హదయం బరువెక్కి
ఎండుటాకుల రాలిపోతుంది…
స్వప్నాల్ని నిజం చెయ్యలేదని
మనసు ఆత్మహత్య కు సిద్దమౌతుంటే
శరీరం బెలగా నిస్తేష్టులై
కాళ్ళు పుడమిపై కూలబడుతుంటే
ఆకాశం నిండుగా కన్నీళ్లు కురిపిస్తూ
కన్నీళ్లను తన గుండెల్లో కలుపుకుంది…
– ఎలగొండ రవి 9848770345