ఇలలో
సగమయిన మహిళ
ఇంటికే
పరిమితం కావాలా!
వంటగదిలో
గరిట తిప్పడం కాదు
ఇల్లునంతా
సగబెడుతుంది!
ఆలి అయి
ఇల్లు నేలుతుంది
తల్లి అయి
పిల్లలను లాలిస్తుంది!
సగభాగం
తను అయినపుడు
సమ భాగం
ఆమెకివ్వడం సమంజసం!
అవకాశం కల్పిస్తే
ఆకాశమంత ఎదిగి చూపిస్తది
ఆడబిడ్డ నుదుట పెట్టిన బొట్టుబిల్ల
ఈ మహిళా బిల్లు!
ఇకపై మహిళ…..
కుక్కిన పేను కాదు
పులిపై ఎక్కిన దుర్గ!
– జగ్గయ్య.జి, 9849525802