కాంగ్రెస్‌లో చేరిన దోమ ఎంపీపీ, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోని టీఆర్‌ఆర్‌ నివాసంలో శని వారం మండల ఎంపీపీ పటోల్ల అనుసూజ, జిల్లా గ్రంథా లయ డైరెక్టర్‌ బంగ్లా యాదయ్య గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షులు పటోళ్ల రాఘవేందర్‌ రెడ్డి, దోమ ఎంపీ టీసీ బంగ్లా అనిత, బుద్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ మాధ వులు, కొండయ్య పల్లి సర్పంచ్‌ తనయుడు ప్రసాద్‌ గౌడ్‌, పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, ఊట్పల్లి మాజీ ఉపసర్పంచ్‌ వెంకటయ్య గౌడ్‌, రాకుండా మాజీ సర్పంచ్‌ చాపల వెంకటయ్య, బాసుపల్లి కావటి శ్రీనివాస్‌,మైలారం మాటరి నర్సింలు, కొండాయిపల్లి మహిపాల్‌ రెడ్డి, బడేం పల్లి మంచలి రాజు, దోమ, కిష్టాపూర్‌, బుడ్లపూర్‌, బ్రాహ్మ ణపల్లి, దిర్సంపల్లి, బడంపల్లి, కొండాయిపల్లి, దాదాపూర్‌, ఐనాపూర్‌, మైలారం బాస్‌ పల్లి, పరిగి పట్టణం, కుసుమ సముద్రం, రాకొండా పోతిరెడ్డిపల్లి తిమ్మాయిపల్లి ఊట్పల్లి, తదితర గ్రామాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీి అధ్యక్షులు రామ్మో హన్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రామ్మోహన్‌ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రా మ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.పార్టీలో చేరిన ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లందరికీ స్వాగతం తెలిపారు. కార్యక్ర మంలో మండలం అధ్యక్షులు విజరు కుమార్‌ రెడ్డి, పట్ట ణాధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండలాధ్యక్షులు సురేందర్‌ ముదిరాజ్‌, నారాయణ, ఆంజనేయులు, జితేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శాంతు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love