నీ అంతులేని వ్యధను చూసి
మనసెంతో గాయపడింది
జన జీవనస్రవంతిలో కలిశాక
నా భావోద్వేగాలు గుండె గూటిలో
భద్రంగా ఉండినాయి..
గత కొన్ని రోజుల నుండి
అవి ఘనస్థితిలోనే ఉండి
మళ్ళీ ఇవ్వాళ తమ
వాస్తవస్థితికి తిరిగిచేరుకున్నాయి..
నిను చూడలేని
కష్టకాలంలో కనుచూపుమేరలో
కన్నీళ్ల ప్రవాహం
ఉరకలెత్తి ప్రవహించింది..
కానీ చాలారోజులకు
నిను చూశాక కూడా ఎందుకో..
అవి
ఇవ్వాళ తమ ఆనకట్టను తెంపి
కిందికి దూకుతున్నాయి..
నువ్వొక్కడీవే తనతో
కలిస్తే సరిపోతుందా…
మేము కూడా తనను
కలిసేవాళ్లమని నా హదయంతో
పొట్లాడి కిందికి ధారగా దూకుతున్నాయి..
– సర్ఫరాజ్ అన్వర్
9440981198