కేరళ యువ సాహిత్య కెరటం

పుట్టి పెరిగిన చెట్టూచేమే అతడి అక్షరానికి ఆయువు.తనవాళ్ల కలిమిలేములే తన కథలకు ముడిసరుకు.కేరళకు చెందిన ఓ జేసీబీ డ్రైవర్‌.. ఇష్టమైన పనిని ఎవరైనా మనసు పెట్టి చేస్తారు. అది మనసుల్నికదిలించేలా ఉంటే.. గుర్తింపు వెతుక్కుని మరీవస్తుంది. చిన్ననాటి నుంచే తను పుట్టి పెరిగిన మట్టిపరిమళాలు.. ప్రకతమ్మతో మమేకమైన జీవనశైలి..కల్మషం లేని బతుకుల్ని కథలుగా చిత్రీంచేవాడు.కథలుగా రాసేవాడు. ఇరవయ్యేళ్లు వచ్చేసరికి ఈభావాల్నింటికీ అక్షర రూపమిచ్చి కథల సంపుటిగామలిచాడు. ఆ సాహితీ సౌరభాలు ఎల్లలు దాటిపరిమళిస్తున్నాయి. ఇటీవల కేరళ సాహిత్య అకాడమీపలు విభాగాల్లో అవార్డులను ప్రకటించింది. ఈ ఇరవై ఏనిమిదేండ్ల యువ కథా రచయిత కె.అఖిల్‌ప్రతిష్టాత్మకమైన సాహిత్య అవార్డు వరించింది. ఈక్రమంలోనే గీతా హిరణ్య ఎండోమెంట్‌ అవార్డ్‌ 2022కు అఖిల్‌ ను ఎంపిక చేసింది అకాడమీ.2020లో ప్రచురితం అయిన చిన్న కథల సంకలనం’నీలచడయాన్‌’కు ఈ అవార్డ్‌ వచ్చింది. కుటుంబ ఆర్థికసమస్యలతో టీనేజ్‌ లో ఉన్నప్పుడు రోజూ న్యూస్‌ పేపర్‌వేసేవాడు. రాత్రి సమయాల్లో ఇసుక తవ్వేందుకు వెళ్లి..అర్థరాత్రి వరకు అక్కడే పని చేసేవారు. ఆ తరువాత జేసీబీ ఆపరేటర్‌ గాను పనిచేశాడు. ఇటువంటి క్లిష్ట సమయాల్లోనూ.. వీలు చిక్కినప్పుడల్లా రచనలు చేస్తుండేవాడు. గొప్ప జీవితానుభవం లేకుండా గొప్పపుస్తకాలు పుట్టవు.. సామాన్యుల నుంచి కూడాఅద్భుతాలు ఆవిష్కరణ జరుగుతుందని నిరూపించిన యువ కథకుడి పరిచయం అతడి మాటలలోనే...
పని చేసే సమయంలో ఒంటరితనాన్ని అధిగమిం చేందుకు సమాజంలో నుంచి గ్రహించిన విషయాల ఆధారంగా తనలో తాను కథలు ఊహించుకునేవాడినని అఖిల్‌ వెల్లడించారు. తన జీవితంలో చాలా మందిని కలిశానని.. వారి అనుభవాలను, ఇతర అంశాలను గ్రహించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అవార్డ్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన అఖిల్‌.. ఇది తాను అస్సలు ఊహించలేదని చెప్పారు.
నాకు ఇప్పటికి నమ్మశక్యం కావడం లేదు. ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు రావడం అనేది నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక జేసీబీ ఆపరేటర్‌ జీవితంలోని కష్టతరమైన వాస్తవికత కథే ఇది. ఒక 28 ఏండ్ల సాధారణ యువకుడు అందుకున్న గొప్పవిజయం ఇది. సముచితంగా, సజనాత్మకత, అద్భుతమైన ప్రయాణం.. జేసీబీ ఆపరేటర్‌గా పనిలో అలసిపోయినప్పుడు, నాకు నేను స్వాంతన చెందడం కోసం ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. నా ఆలోచనలు కథాంశాలను వ్రాయడానికి రాత్రి సమయంలో సమయాన్ని వెతుకుతున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, అమ్మమ్మలతో కూడిన ఒక చిన్న కుటుంబం మాది. ఆ కుటుంబ పోషణకే నేను నా చదువుకు స్వస్తీ చెప్పి.. డ్రైవర్‌ గా మారాల్సి వచ్చింది. కానీ సాహిత్య ప్రపంచం పట్ల నాకున్న ప్రేమ మాత్రం సజీవంగానే ఉంది. నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రేమ పెరిగింది. అదే నేడు ఒక ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని పొందడానికి ఈ రోజువారీ వేతన కార్మికుడికి అర్హతను ఇచ్చింది.
నేను రాసిన కథలను ప్రచురించుకోవాలని, నా కథలను అచ్చులో చూసుకోవాలని నాకు చాలా ఆశగా ఉండేది. అందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. అయినా, పబ్లిషర్స్‌ చుట్టూ తిరిగే వాణ్ని. నాకు అంతగా పేరు లేకపోవడంతో.. అమ్మకాలు జరగవని, చాలా కష్టమని ప్రచురణకర్తలు చెప్పేవారు. విసిగిపోయిన నాకు ఫేస్‌ బుక్‌ లో ఓ ప్రకటన కనబడింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. రచయితలెవరైనా పుస్తకాలు ప్రచురణ చేయాలనుకుంటే.. కేవలం రూ.20,000 చెల్లిస్తే తాము ఆ పని చేసి పెడతామని దాని సారాంశం. దీంతో నేను కూడా నా ”నీలచడయాన్‌” రచనను ప్రచురణ చేయాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా దగ్గర రూ.10,000 మాత్రమే ఉన్నాయి. అమ్మ రోజూ కూలీకెళ్లి దాచుకున్న మరో 10వేల రూపాయలను నాకు ఇచ్చింది. అలా నా మొదటి పుస్తకం వెలుగు చూసింది. కానీ ఆ పుస్తకాలు ఆన్‌ లైన్‌ లోనే అమ్మకాలు జరిగాయని.. బుక్‌ స్టోర్‌ లో అందుబాటులో ఉండేవి కావని ఆయన వెల్లడించారు. దీంతో ఆ పుస్తకం సమాజంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
అఖిల్‌ రచించిన పుస్తకాలు
‘నీలచడయాన్‌’ పుస్తకాన్ని ప్రముఖ సినిమా రచయిత బిపిన్‌ చంద్రన్‌ చదివారు. ఆయనను ఆ కథలు ఆకట్టుకున్నాయి. ‘నీలచడయాన్‌’ ఆయన స్పందనను ఫేస్‌ బుక్‌ ద్వారా పంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ‘నీలచడయాన్‌’కు బాగా ప్రాచుర్యం లభించింది. ఆ తరువాత చాలా మంది బుక్‌ స్టోర్‌ లలో ‘నీలచడయాన్‌’ పుస్తకం కోసం ఆరా తీశారని.. దీంతో ప్రచురించలేమన్న పబ్లిషర్లే పుస్తక ప్రచురణకు ముందుకు వచ్చారు.
కొత్తగా వచ్చే రచయితలకు పుస్తక పబ్లిషింగ్‌ కోసం ప్రచురణకర్తలను ఒప్పించడం, పాఠకులను ఆకర్షించడం చాలా కష్టమైన పని. కేరళ సాహిత్య అకాడమీ సేవలు వర్ధమాన రచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 2021లో ‘నీలచడయాన్‌ – పుస్తకాన్ని రాయడం పూర్తి చేశాను. ఉత్తర కేరళలో ఆచరించించే ‘థెయ్యం’ అనే సంప్రదాయం ఆధారంగా ఈ కథ రూపొందిద్దుకుంది. 2022 ‘తారకంఠన్‌’ అనే రామయణం ఆధారిత పుస్తకాన్ని తీసుకువచ్చాను. ప్రస్తుతం ఈ పుస్తకాలు మాతభూమి బుక్స్‌ ద్వారా ప్రచురితం అయ్యాయి. జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికి.. ఈ స్థాయిలో గుర్తింపు పొందడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది.
– అనంతోజు మోహన్‌ కష్ణ

Spread the love